రాష్ట్రంలో కూటమి పాలనలో రైతులు ఆగమాగం అయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. లక్షల్లో అప్పులు, రోజుకో బలవన్మరణం పాల్పడుతున్నారని వాపోయారు.. రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానం నిలవడం దారుణమన్నారు. ఇది సిగ్గు చేటు అని పేర్కొన్నారు. ప్రభుత్వం మారినా రైతుల తల రాత మారలేదన్నారు. చంద్రబాబు సొల్లు కబుర్లు చెప్పడం తప్పా చేసింది ఏమీ లేదన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర దక్కడం లేదన్నారు.