బడ్జెట్ లో హోం శాఖకు ప్రత్యేక నిధులు
NEWS Feb 15,2025 04:20 am
మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి బడ్జెట్ లో హోం శాఖకు ప్రత్యేకంగా కేటాయింపులు ఉంటాయన్నారు. ఫోరెన్సిక్ కు ఊతం ఇస్తామని, ఫింగర్ ప్రింట్ కు ప్రాణం పోస్తామన్నారు. అప్పా, ఆక్టోపస్, గ్రే హౌండ్స్ ఏర్పాటుకు నిధులివ్వాలని ప్రతిపాదించడం జరిగిందన్నారు. ఈగల్ వ్యవస్థ, జైళ్ల నిర్మాణం, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఇన్వెస్టిగేషన్ ఛార్జీల అంచనాను పెంచాలని కోరామన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులతో పోలీస్ శాఖను బలోపేతం చేస్తామన్నారు.