కోమటికుంటలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
NEWS Feb 13,2025 12:43 pm
మేడ్చల్ జిల్లా తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని కోమటికుంట చెరువులో చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా ఆధ్వర్యంలో కూల్చి వేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టారంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపాలిటీ అధికారులతో విచారణ చేపట్టారు. చెరువు పరిధిలో నిర్మించిన ప్రకృతి రిసార్ట్స్ , ప్రకృతి కన్వెన్షన్ కు ఎలాంటి నిర్మాణ అనుమతులు లేవని స్పష్టం చేసింది. హైడ్రా నోటీసులపై కోర్టును ఆశ్రయించినా ఫలితం లేక పోయింది.