అధికారం ఉంది కదా అని విర్రవీగిన వాళ్లకు జైలు కూడు తప్పదని హెచ్చరించారు మంత్రి వాసం శెట్టి సుభాష్. టీడీపీ ఆఫీస్ పై దాడి ఘటనలో ఫిర్యాదు చేసిన దళితుడుని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇబ్బంది పెట్టాడని ఆరోపించారు. అందుకే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారన్నారు. టీడీపీ కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగదన్నారు. కేసులకు సంబంధించి పారదర్శకంగా విచారణ చేపడతామన్నారు.