వాలంటైన్ డే పేరుతో వెర్రి వేషాలు తగదు
NEWS Feb 13,2025 08:42 am
వాలంటైన్ డే పేరుతో కొందరు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారంటూ పేర్కొన్నారు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. అదేదో ఘనత సాధించినట్లు యువతీ యువకులు ప్రమాదకరమై స్టంట్స్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జీవితం అనేది ఒక్కసారే వస్తుందని, మిమ్మల్ని పెంచి పోషిస్తున్న పేరెంట్స్ కు భారం కావద్దని సూచించారు. చాలా మంది ఓవర్ నైట్ లో ఫేమస్ అయి పోవాలని ఇలాంటి చెత్త పనులు చేస్తున్నారంటూ మండిపడ్డారు.