వంశీ అరెస్ట్ తో కృష్ణా జిల్లాలో 144 సెక్షన్
NEWS Feb 13,2025 07:43 am
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభ నేని వంశీని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఉన్న తనను అదుపులోకి తీసుకున్నారు. తన ఇంటికి నోటీసులు అందజేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశామన్నారు పోలీసులు. వంశీ అరెస్ట్ తో కృష్ణా జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముందే గ్రహించిన జిల్లా ఎస్పీ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. 30 యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. కాగా కూటమి సర్కార్ కక్ష సాధింపుతో అరెస్ట్ చేసిందన్నారు వంశీ.