మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన చేశారు. తాను తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నానని జరుగుతున్న ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టారు. తాను ఇక నుంచి పాలిటిక్స్ కు రావాలని అనుకోవడం లేదన్నారు. ఇప్పుడు సినిమాల పరంగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నానని చెప్పారు. విశ్వంభర పూర్తి కావచ్చిందని, దర్శకులతో కథలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని అన్నారు. తాను నెరవేర్చలేని వాటిని తన తమ్ముడు పవన్ కళ్యాణ్ తీరుస్తాడని చెప్పారు చిరంజీవి.