జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామంలో శ్రీ ముద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ . ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సంజయ్ ని శాలువాతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్దికి తన వంతు సహకారం అందజేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ఇప్పటికీ సజీవంగా ఉందన్నారు.