గంగాధర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోతుల బెడదతో ప్రజలకు ఇబ్బందిగా మారింది. దీంతో ఆసుపత్రులోనికి రావడానికి ప్రజలు బయపడుతున్నారు. ఆసుపత్రిలో ఉన్న వైద్య సిబ్బంది, చికిత్స తీసుకుంటున్న రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కోతుల భయంతో ఆసుపత్రి డోర్‌లు మూసి ఉంచవలసిన పరిస్థితి ఉందని రోగులు, అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.