మెట పల్లి పట్టణంలోని ఆరపేట శివారులో గల సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలను మంగళవారం సందర్శించారు ఎమ్మెల్యే డా. సంజయ్. ఇబ్రహీంపట్నం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాల, మోడల్ స్కూల్ ని సందర్శించారు. కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను సందర్శించి పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులతో మాట్లాడారు. బాగా చదువు కోవాలని సూచించారు.