బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ స్వయంగా హెచ్ఐవీ టెస్ట్ చేయించుకున్నారు. నేషనల్ హెచ్ఐవీ టెస్టింగ్ వీక్ సందర్బంగా స్వచ్చందంగా పరీక్ష చేయించు కోవడం చర్చనీయాంశంగా మారింది. దేశ ప్రజలంతా ముందుకు రావాలని, టెస్ట్ లు చేయించు కోవాలని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. హెచ్ఐవీ టెస్ట్ అత్యంత అవసరమన్నారు.