క్రీడాకారులకు ఆహ్వానం
NEWS Feb 10,2025 10:31 am
నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ములుగు బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ 12, 13 తేదీల్లో నిర్వహించనున్నారు. కబడ్డీ , వాలీబాల్ , బ్యాడ్మింటన్, రన్నింగ్ తదితర పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలలో పాల్గొనే యువకులు వారి పేర్లను ముందుగానే 9502126384, 950549603 ఫోన్ ద్వారా నమోదు చేసుకోవాలని నెహ్రూ యువ కేంద్రం వాలంటీర్ నవీన్ యాదవ్ తెలిపారు .ఈ పోటీలో విజేతలకు ఎలాంటి నగదు బహుమతులు ఉండవని, కానీ ప్రశంసా పత్రాలు అందజేస్తామన్నారు.