ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుష్ప2 ఘన విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కొన్ని సంఘటనలు తనను బాధ కలిగించాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తమ సినిమాను ఆదరించారని, ఊహించని రీతిలో సక్సెస్ కట్టబెట్టారన్నారు. ఏకంగా రూ. 2 వేల కోట్లకు పైగా వసూలు సాధించి రికార్డు సృష్టించిందన్నారు. భారీ విజయాన్ని కట్టబెట్టిన అభిమానులకు థ్యాంక్స్ తెలిపారు బన్నీ.