సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అరెస్ట్ కు సంబంధించి 60 దేశాల్లో నిరసనలు తెలిపారని అన్నారు. అయితే తెలంగాణలో నిరసన చేపట్టాలని చూస్తే ఆనాటి బీఆర్ఎస్ సర్కార్ అణదగొక్కేందుకు ప్రయత్నం చేసిందన్నారు. అందుకే ఫలితాన్ని అనుభవించిందన్నారు. ప్రజలు వాస్తవాలను పరిగణలోకి తీసుకున్నారని చెప్పారు. తనకు వ్యక్తులను విమర్శించాలని ఉండదన్నారు. వాళ్లు అవలంభించిన విధానాలు సరిగా లేవన్నారు.