కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. కొత్త రేషన్ కార్డులు మాత్రమే కాకుండా ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పు చేర్పులు కూడా ఆన్‌లైన్ ద్వారా సులభంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. కొత్త రేషన్ కార్డుల జారీ కొనసాగుతుందని, దీనికి ఒక నిర్దిష్టమైన గడువు లేదని ప్రభుత్వం పేర్కొంది.