ఇసుక అక్రమ రవాణాకు ఎన్ని ఎత్తులు వేయాలో అన్ని అమలు చేస్తున్నారు. అక్రమార్కులు. ధనార్జనే ధ్యేయంగా వాగుల నుంచి ఇసుకను తోడి అడ్డదారిన జీరో దందాను సాగిస్తూ చేసుకుంటున్నారు. అడపాదడపా పోలీసులకు చిక్కుతున్నా.. వ్యూహాలు మార్చి దందా సాగుతుండటంతో ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పడుతోంది. ఆసిఫాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా అడ్డు అదుపు లేకుండా పోతుంది. గంగాపూర్, గొల్లగూడ,వంకుళం,పెద్దవాగులా నుంచి పెద్ద మొత్తంలో ఇసుకను తవ్వి ఆదిలాబాద్ లాంటి పట్టణ ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.