రైతు నల్ల చట్టాలు రద్దు చేయాలి
NEWS Feb 07,2025 02:27 am
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను, మూడు రైతు నల్ల చట్టాలను వెంటనే రద్దు చేసి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం పార్లమెంట్ లో ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిర్ర దేవేందర్ మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా నాలుగు కోడ్ లను,మూడు రైతు నల్ల చట్టాలను కూడా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.