341 ఆర్టికల్ ప్రకారం వర్గీకరణ చేయాలని తాము చెప్పిన వినకుండా ఏకపక్షంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఓ వర్గానికి వత్తసు పలికేల బిల్లును అమోదించడం సరైంది కాదని మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు కోప్పుల రమేష్ అన్నారు. సీఎం తీరును నిరసిస్తూ కలెక్టర్ చౌక్ లో నిరసన తెలిపారు. అనంతరం సీఎం ఫ్లెక్సీని దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు వాటిని లాక్కున్నారు. దీంతో వారి మధ్య తోపులాట జరగడంతో కాస్త ఉద్రిక్తత నెలకొంది. అనంతరం రోడ్డుపై బైటాయించి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.