8న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు
NEWS Feb 06,2025 01:02 pm
మెట్ పల్లి మినీ స్టేడియంలో ఈనెల 8న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తయ్య రెడ్డి, సభ్యులు అంజయ్య, కొమురయ్య, కార్తీక్ తెలిపారు. అండర్ 14, 16, 18, 20 బాల బాలికలకు, యువతీ యువకులకు రన్నింగ్, షాట్ ఫుట్, డిస్కస్ త్రో, లాంగ్ జంప్, కిడ్స్ జావలిన్ త్రో వివిధ పోటీలు నిర్వహించబడుతాయన్నారు. ఆసక్తి గలవారు ఉదయం 8 గంటలకు రిపోర్ట్ చేయాలన్నారు.