అనకాపల్లి జిల్లా వడ్డాది పాఠశాల విద్యార్థినిపై లైంగికంగా దాడికి పాల్పడ్డాడు అక్కడ పని చేస్తున్న టీచర్ ప్రసాద్. దీనిపై సీరియస్ గా స్పందించారు మంత్రి వంగలపూడి అనిత. విద్యా బుద్దులు చెప్పాల్సింది పోయి అసభ్యంగా ప్రవర్తించడం పట్ల మండిపడ్డారు. వెంటనే టీచర్ ను అరెస్ట్ చేయాలని ఆదేశించారు. ఈ ఘటన టీచర్ వర్గాల్లో కలకలం రేపింది.