తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఛాంబర్ నుంచి అవార్డులు ఇస్తామని ప్రకటించింది. తెలుగు సినిమా పుట్టిన రోజు వేడుకల్లోనే ఈ పురస్కారాలు అందజేస్తామని తెలిపింది. ప్రభుత్వం ఇచ్చే అవార్డులతో పాటు ఫిల్మ్ ఛాంబర్ నుంచి కూడా ఉంటాయని పేర్కొంది. సినిమా పుట్టిన రోజు ప్రతి సినిమా నటుడు ఇంటిపై, థియేటర్ వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాలని స్పష్టం చేసింది. జెండా రూపకల్పన బాధ్యత పరుచూరి గోపాలకృష్ణకు అప్పగించింది.