అనారోగ్యానికి గురైన పవన్ కళ్యాణ్
NEWS Feb 06,2025 02:26 am
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు సీఎంవో వెల్లడించింది. వైరల్
ఫీవర్‌తో పాటు స్పాండిలైటిస్‌తో బాధ పడుతున్నారని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని, ఇవాళ జరిగే కేబినెట్ కీలక సమావేశానికి హాజరు కావడం లేదని స్పష్టం చేసింది.