ఆధ్యాత్మిక గురువు ఆగా ఖాన్ ఇక లేరు
NEWS Feb 05,2025 07:57 am
ప్రపంచ ముస్లింల ఆధ్యాత్మిక గురువు, పద్మ విభూషణ్ గ్రహీత ఆగా ఖాన్ మృతి చెందారు.
సామాజిక వేత్తగా, మానవతావాదిగా పేరు పొందారు. ఆగాఖాన్ నెట్ వర్క్ ద్వారా వివిధ దేశాల్లో ఆస్పత్రులు, విద్యా, సాంస్కృతిక సంస్థలను నెలకొల్పి మానవాళికి విశిష్ట సేవలు అందించారు. వేలాది మంది విద్యార్థులకు విద్యా దానం చేశారు. ఉన్నతమైన చదువులు చదివేందుకు దోహద పడ్డారు ఆగా ఖాన్. ఆయన మృతి పట్ల సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.