మల్యాల మండల కాంగ్రెస్ నాయకుడు నక్క అనిల్ మండలంలోని బల్వంతాపూర్ గ్రామ క్రికెట్ టీమ్ ని ప్రోత్సహించడానికి యువకులకు జెర్సీలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రీడల వల్ల శరీర దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం ఉంటుందని, యువత క్రీడాకారులుగా ఎదిగి గ్రామంతోపాటు నియోజకవర్గానికి వన్నె తేవాలని కోరారు. క్రీడలను ప్రోత్సహించి యువతకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతోనే జెర్సీలు పంపిణీ చేసినట్లు అనిల్ తెలిపారు.