నటుడు రాజ్ తరుణ్ - లావణ్య కేసులో మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. పలువురు అమ్మాయిలతో ప్రైవేట్ గా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాడని విచారణలో గుర్తించారు. తనకు చెందిన కొన్ని వీడియోస్ ను రికార్డ్ చేశాడంటూ లావణ్య ఆరోపించింది. సాయి హార్డ్ డిస్క్ ఓపెన్ చేస్తే 200కు పైగా వీడియోలు ఉండడంతో అవాక్కయ్యారు.