టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరి గోవాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కబాలి తెలుగు వెర్షన్ మూవీని నిర్మించాడు. పలు తెలుగు, తమిళ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు. నిర్మాతగా సక్సెస్ కాలేక పోవడం, నష్టాలు రావడంతో గోవాలో ఓమ్ పేరుతో పబ్ స్టార్ట్ చేశాడు. అక్కడ కొందరి పరిచయాలతో సెలిబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ లో పట్టుబడిన డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. పబ్ లో కూడా లాస్ రావడంతో సూసైడ్ చేసుకున్నాడు.