క్రిమినల్ బత్తుల ప్రభాకర్ వెపన్స్ సీజ్
NEWS Feb 02,2025 06:15 am
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ విషయంలో కీలక అప్ డేట్ ఇచ్చారు హైదరాబాద్ డీసీపీ వినీత్ గంగన్న. నిన్న గచ్చిబౌలి లోని ప్రిజం పబ్ లో ఎవరికీ తెలియకుండా అటెండ్ కావడంతో విశ్వసనీయ సమాచారం మేరకు అటాక్ చేశామన్నారు. ఇదే సమయంలో కాల్పులకు తెగబడ్డాడని, ఈ ఘటనలో తమ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డికి గాయమైందని, ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నట్లు చెప్పారు. బత్తుల ప్రభాకర్ మీద 80కి పైగా కేసులు ఉన్నాయని , మిస్సింగ్ కేసులే ఇందులో ఎక్కువని, వెపన్స్ ను సీజ్ చేశామన్నారు.