మెట్ పల్లి సీఐ నీరంజన్ రెడ్డి ఇండియన్ పోలీస్ మెడల్ అవార్డుకు ఎంపిక కావడంతో కథలాపూర్ మండలానికి చెందిన రైతు సంఘం ప్రతినిధి గడ్డం భూమారెడ్డి, కథలాపూర్ ప్రిన్సిపల్ కమలాకర్ ఆయన్ను శాలువాలతో సన్మానించారు. సీఐ నీరంజన్ రెడ్డి పోలీస్ శాఖలో విధుల్లో చేరినప్పటి నుంచి సామాజిక సేవ చేశారని వారు కొనియాడారు. ఈ ప్రాంతంలో 20 ఏళ్లుగా పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పని చేశారన్నారు.