మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంపలో సమస్యలను పక్కన పెట్టి సినిమా వాళ్ల వెంట పరుగులు తీస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. వాళ్లు సినిమాల్లో మాత్రమే హీరోలని నిజ జీవితంలో కాదంటూ ఎద్దేవా చేశారు. కమల్ హాసన్ కంటే పవన్ కళ్యాణ్ గొప్ప నటుడేమీ కాదన్నారు. కమల్ హాసన్ ఎన్నికల్లో ఓడి పోయాడు..చిరంజీవి రెండు చోట్ల పోటీ చేసి ఒక్క చోట గెలిచాడని, ఇక హిందూపురం కాబట్టి బాలకృష్ణ మూడుసార్లు గెలిచాడని, వేరేచోట అయితే గెలిచే వాడు కాదన్నారు.