నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బోర్గాంలో భార్య స్వర్ణలతను చంపి చెరువులో పడేశాడు భర్త పోతన్న. ఆ తర్వాత భార్య కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. చెరువులో పోతన్న భార్య శవం లభ్యం అయింది. పోలీసుల విచారణలో తానే చంపి చెరువులో పడేసినట్లు ఒప్పుకున్నాడు భర్త. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు పోలీసులు. మీర్‌పేట్ తరహాలో మరో హత్య జరిగడంతో.. రెంజల్ మండలం బోర్గాంలో జనాలు వణికిపోతున్నారు.