ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా మాజీ డీజీపీ ద్వారకా తిరుమల రావును నియమించింది. సీఎం నారా చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయ కుమార్ కీలక ప్రకటన చేశారు. ద్వారకా తిరుమల రావు గతంలో ఏపీఎస్ఆర్టీసీకి ఎండీగా పని చేశారు. సంస్థను గాడిలో పెట్టేందుకు యత్నించారు. కూటమి సర్కార్ వచ్చాక తనను డీజీపీగా ఎంపిక చేశారు సీఎం. పదవీ కాలం ముగియడంతో తన స్థానంలో గుప్తాను నియమించారు.