కేంద్ర ప్రభుత్వం ఓబీసీల కుల గణన జరిపించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్. ముంబైలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సమాధి చైత్య భూమిని సందర్శించారు. ఘనంగా నివాళులు అర్పించారు. చట్ట సభల్లో కుల దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కల్పించాలని అన్నారు. ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అంబేద్కర్ గనుక రాజ్యాంగం రాయక పోయి ఉంటే బహుజనులకు రాజ్యాధికారం దక్కేది కాదన్నారు.