రాష్ట్రంలో ఏ ఒక్కరు తాగు నీటి కోసం ఇబ్బంది పడకుండా చూడాలని స్పష్టం చేశారు మంత్రి దాసరి సీతక్క. మిషన్ భగీరథపై సమీక్ష చేపట్టారు. వచ్చేది ఎండా కాలం కావడంతో తీవ్రంగా నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. వచ్చే 5 నెలల కోసం ప్రణాళిక రూపొందించు కోవాలని స్పష్టం చేశారు. వేసవి ముగిసేంత వరకు నీటి కష్టాలు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రతి మనిషికి 100 లీటర్ల నీటిని ప్రతి రోజూ అందాల్సిందేనని అన్నారు సీతక్క.