భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తను గల్లీ స్థాయి లీడర్ లాగా మాట్లాడుతున్నాడని, కేంద్ర మంత్రి హోదాలో ఉన్నానన్న సోయి లేకుండా ఎలా పడితే అలా మాట్లాడితే మంచిది కాదన్నారు. ప్రజా యుద్ద నౌక గద్దర్ గురించి మాట్లాడే నైతిక హక్కు బండికి లేదన్నారు. ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన గద్దర్ ఎక్కడ నువ్వు ఎక్కడ అంటూ మండిపడ్డారు.