రాష్ట్రానికి సంబంధించి మెరుగైన పర్యాటరంగ పాలసీని తయారు చేయాలని స్పష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. దేవాదాయ, ధర్మాదాయ శాఖపై సమీక్షించారు. ఫిబ్రవరి 10 లోపు మెరుగైన, భారీ ఆదాయం వచ్చేలా పాలసీ ఉండాలని ఆదేశించారు. పాలసీ తయారు చేసే కంటే ముందు సింగపూర్ టూరిజం పాలసీని అధ్యయనం చేయాలని సూచించారు. అక్కడి ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అద్భుతంగా మార్చేసిందని, అత్యధిక ఆదాయం వీటి ద్వారానే వస్తుందన్నారు రేవంత్ రెడ్డి.