మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇద్దరు తన ముందు బచ్చాలంటూ మండిపడ్డారు. వాళ్లతో తనకు పోలికలు ఏంటి అంటూ ప్రశ్నించారు. వాళ్లందరి కంటే తాను ముందుగా రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. తాను ఎంతో మంది సీఎంలను చూశానని చెప్పారు. తాను ఎవరితో పోల్చుకోనని, తాను ఇంకెవరికీ పోటీ కానని అన్నారు. తన పోటీ మాజీ సీఎం కేసీఆర్ తోనేనని స్పష్టం చేశారు.