అర్బన్ ఎమ్మెల్యే పుణ్య స్నానం
NEWS Jan 30,2025 07:04 am
మహా కుంభమేళలో నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్త కుటుంబ సమేతంగా పుణ్య స్నానాలు చేశారు. మౌని అమావాస్య రోజున ప్రయాగ్ రాజ్ లోని గంగ, యమున, సరస్వతి నదుల పవిత్ర కలయిక అయిన త్రివేణి లో కుటుంబ సమేతంగా పవిత్ర స్నానాలు ఆచరించారు. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళా అన్నిటికంటే అతి పవిత్రమైందన్నారు. పవిత్ర గంగలో స్నానం చేయడం వల్ల పుణ్యం, మోక్షం వస్తుందని, ఇది భక్తుల నమ్మకమని ఎమ్మెల్యే అన్నారు.