కొత్త మండలాల్లో మండల పరిషత్‌లు
NEWS Jan 30,2025 03:09 am
కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ, మహ్మద్‌నగర్, డోంగ్లీ మండలాల్లో మండల పరిషత్ కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో పాటు ఇన్‌చార్జీ ఎంపీడీవోలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మాచారెడ్డి మండలంనుంచి పాల్వంచ, నిజాంసాగర్ మండలం నుంచి మహ్మద్‌నగర్, మద్నూర్ మండలం నుంచి డోంగ్లీ మండలాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ సీఈవో మండల పరిషత్ కార్యాలయాలకు భవనాలను ఎంపిక చేసి, అధికారులను నియమించారు. పాల్వంచ మండల ఎంపిపి ఆఫీస్ ను విండో కార్యాలయంలో ఏర్పాటు చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు.