నిజామాబాద్ లోని జీజీహెచ్ పేద రోగులకు వరమా? శాపమా అర్థం కావడం లేదని రోగులు అంటున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రోగులే కాకుండా కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు చెందిన వారితో పాటు మహారాష్ట్ర కు చెందిన రోగులు కూడా వందల సంఖ్యలో ఇక్కడికి చికిత్స కోసం వస్తారు. రోజూ దాదాపు 2 వేల వరకు ఔట్ పేషంట్లతో పాటు అధిక సంఖ్యలో రోగులు ఇన్ పేషంట్ విభాగంలో ఉంటారు. 24గంటల ఉండగా, రోగులకు డాక్టర్లు వైద్యం అందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.