కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. తనకు పాలన చేత కాదంటూ చేతులెత్తేశాడని అన్నారు. టీడీపీ, వైసీపీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో విఫలం అయ్యాయని ఆరోపించారు. బీజేపీ అండతోనే జగన్ రెడ్డి బెయిల్ పై బయట తిరుగుతున్నాడని ధ్వజమెత్తారు. విచిత్రం ఏమిటంటే ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన సీఎం తాను ఏమీ చేయలేక పోతున్నానంటూ నిరాశ చెందడం పట్ల ఫైర్ అయ్యారు. ఎందుకు హామీలు ఇచ్చావో చెప్పాలన్నారు.