నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయండి
NEWS Jan 29,2025 07:48 am
కార్మిక చట్టాలను రద్దు చేసి ఏప్రిల్ 1 నుండి అమలు చేయదలచిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని ఏఐటీయూసీ జిల్లా అద్యక్ష, ప్రధాన కార్యదర్శులు తుమ్మల రాధాకృష్ణ, సాంబశివ డిమాండ్ చేశారు. బుధవారం రైల్వే కోడూరు గాంధీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం రైతాంగానికి , కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు.