మహా కుంభ మేళాలో జరిగిన తొక్కిసలాటలో 20 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం రావాల్సి ఉంది. దీనిపై స్పందించిన సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. ప్రధానమంత్రి తనతో నాలుగుసార్లు ఫోన్ లో మాట్లాడారని చెప్పారు. గవర్నర్ తో పాటు తాను కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని, బాధితులకు మెరుగైన వైద్యం అందజేస్తున్నట్లు తెలిపారు.