విద్యా సంస్థల్లో ఆహార భద్రతపై రిపోర్ట్
NEWS Jan 29,2025 03:37 am
రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఆహార భద్రత, నాణ్యతకు సంబంధించి ఇటీవల చోటు చేసుకున్న ఘటనలపై విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో బృందం పర్యటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల్లోని వందలాది ప్రభుత్వ పాఠశాలలు, నివాస విద్యా సంస్థలు (గురుకులాలు), హాస్టళ్లు, కేజీబీవీలు, అంగన్ వాడీ కేంద్రాలను సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. పూర్తి నివేదికను సీఎస్ శాంతి కుమారికి అందజేశారు.