సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్నారు. లెక్కకు మించి అప్పులు చేయడంతో అప్పులు పుట్టని పరిస్థితి నెలకొందన్నారు. దీనికంతటికి కారణం మాజీ సీఎం జగన్ రెడ్డి చేసిన నిర్వాకమేనని మండిపడ్డారు. రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. తెచ్చిన అప్పులు వడ్డీలు తీర్చేందుకే సరి పోతోందన్నారు. భారమైనా ఇచ్చిన హామీలు అమలు చేసి తీరుతామన్నారు సీఎం.