నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు తాజా నీటి వివరాలను అధికారులు బుధవారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 691.100 అడుగుల వద్ద కొనసాగుతుందన్నారు. ఇన్ ఫ్లో 22 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా 60 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 5 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.