రామసముద్రం మండలంలో మైనర్ బాలిక వ్యవహారంలో యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మదనపల్లి గ్రామీణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఓ గ్రామానికి చెందిన (17) సంవత్సరాల మైనర్ బాలికను (32) ఏళ్ల యువకుడు ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో సీఐ విచారణ జరిపి నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.