ప్రయాగ్ రాజ్ లో కొనసాగుతున్న మహా కుంభ మేళాలో భారీ ఎత్తున తొక్కిసలాట చోటు చేసుకుంది. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మౌని అమవాస్య కావడంతో పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో ఏర్పాటు చేసిన బారికేడ్లు విరిగి పోవడంతో ఒకరిపై మరొకరు పడ్డారు. మహిళలు ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదిత్యా నాథ్ ను ఆదేశించారు.