రీజియన్ లో మదనపల్లి డిపోకు మొదటి స్థానం
NEWS Jan 28,2025 12:04 pm
కడప రీజియన్ లో మదనపల్లి ఆర్టీసీ డిపో మొదటి స్థానంలో నిలిచిందని డిపో మేనేజర్ వెంకటరమణ రెడ్డి తెలిపారు. డిపో లోని డ్రైవర్లు అత్యధికంగా ఈపికే 39.61, ఓఆర్ 71.45, కేఎం పిఎల్ 50.40, బ్యాటరీ లైఫ్ లో రాష్ట్రంలో మొదటి స్థానం మదనపల్లి డిపోకు దక్కిందని ఆయన తెలిపారు. మంగళవారం డ్రైవర్లకు కేట్ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రశంసా పత్రాలు అందజేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో చంద్రశేఖర్, రాము, రవి పాల్గొన్నారు.