ఒంటిమిట్ట మండలం టిడిపి నేతలు మంగళవారం మంగళగిరిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఒంటిమిట్టలో జరిగే బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలికారు. మండలంలో జరిగిన భూ కబ్జాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వారు తెలిపారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని టిడిపి నాయకులు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి మండల ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు, చింతరాజుపల్లి సర్పంచ్ వెంకటరమణ పాల్గొన్నారు.