మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. తాము దావోస్ పర్యటనలో లక్షా 79 వేల కోట్ల ఒప్పందాలు చేసుకున్నామని చెప్పారు. వాణిజ్యం, వ్యాపారాలకు అనువైన ప్రాంతంగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు. ప్రజలకు ఉపయోగపడేలా విధానాల్లో మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగేలా చేశామన్నారు. మూసీ ప్రక్షాళన, నిరుద్యోగులకు నైపుణ్యం పెంపునకు సహకరిస్తామని సింగపూర్ ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు.